06-07-2025 07:49:00 PM
ఆప్తుడి కుటుంబానికి అండగా నిలిచిన పదో తరగతి దోస్తులు
తుంగతుర్తి (విజయక్రాంతి): చిన్ననాటి స్నేహితులు జీవితాంతం గుర్తుంటారు. స్నేహం అంటే కేవలం స్కూలు, కాలేజీ దాటే వరకే కాదు.. మనం ఈ లోకాన్ని విడిచి వెళ్లిన తర్వాత కూడా తోడుంటుందని చాటి చెప్పారు చిన్ననాటి దోస్తులు. మండల పరిధిలోని వెంపటి గ్రామానికి చెందిన చిటిపాక శ్రీధర్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. 2000-01లో పదో తరగతి కలిసి చదువుకున్న స్నేహితులు స్నేహం అంటే కేవలం స్కూలు, కాలేజీ దాటే వరకే కాదు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్లిన తర్వాత కూడా తోడుంటుందని చాటి చెప్పారు. తమ స్నేహితుని కుటుంబానికి మేమున్నామనే భరోసా కల్పించాలనుకున్నారు. అంతా కలిసి ఆ కుటుంబానికి బాసటగా నిలిచారు.
కుటుంబ ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకున్న సహ విద్యార్థులు మృతుడి కుటుంబానికి సాయం చేయాలనే సంకల్పంతో రూ.11000 వేల నగదును సేకరించి ఆదివారం శ్రీధర్ సతీమణికి అందజేసి స్నేహం గొప్పతనాన్ని చాటి చెప్పారు. సహాయం అందించిన వారిలో పోలీస్ కానిస్టేబుల్ గుండగాని ఎల్లయ్య, మాదరబోయిన, రవి, గుండగాని ప్రభాకర్, కొండగడుపుల రవి, తప్పట్ల శ్రీనివాస్, మహేష్, నిర్మల, సంతోష్, సుధాకర్, స్వరూప, తునికి నగేష్, పూలమ్మ, సుజాత, రజిత తదితరులు ఉన్నారు.