calender_icon.png 5 November, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్తీక పౌర్ణమికి ముస్తాబైన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున ఆలయం

05-11-2025 12:30:32 AM

  1. లక్షకు పైగా భక్తుల రాక

ఏర్పాట్లు పూర్తి చేసిన ఈవో శశిధర్ గుప్తా, చైర్మన్ సుధాకర్ యాదవ్

అమీన్ పూర్, నవంబర్ 4 : కార్తీక మాసం అంతా హర హర మహాదేవ శంభో శంకర అంటూ పరమేశ్వరుడి నామస్మరణతో అమీన్ పూర్ బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగ ణం మారుమోగుతుంది. అంతే కాకుండా 365 ఒత్తులతో దీపారాధన చేసి పరమేశ్వరుడిని కొలిచి భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. అలాగే అరటి దొప్పల్లో కార్తీక దీపాలను వెలగించి మురిసిపోతారు.

కార్తీక పౌర్ణమి నేడు బీరంగూడ గుట్టలో శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటా రు. కార్తీక మాసం, పౌర్ణమి రోజున, ప్రజలు దేవాలయంలో ప్రత్యేక పూజలు, దీపారాధనలు చేసి, కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యతను స్వీకరించను న్నారు.

శివాలయంలో దీపారాధన చేయడం, కార్తీక పురాణం పారాయణం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. బుధవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఈవో శశిధర్ గుప్తా, చైర్మన్ సుధాకర్ యాదవ్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జ్వాల తోరణము, పల్లకి సేవ, లక్ష దీపోత్సవము నిర్వహించనున్నారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి... : ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్

బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో రేపు జరగనున్న కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్షలాది మంది భక్తులు విచ్చేయనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్ తెలిపారు.

కార్తీక మాసాన్ని పురస్కరించుకొని బుధవా రం గుట్టపైన ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని, క్యూలైన్ టోకెన్ సిస్టమ్ ద్వారా దర్శనాలు, అభిషేకాలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే దీపోత్సవం కోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని అవసరమైన సౌకర్యాలు కల్పించామని ఆయన తెలిపారు.