08-08-2025 01:47:40 AM
కొత్తకోట ఆగస్టు 07 : కొత్తకోట మండలం మిరాసిపల్లి గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశంలో సోదరి సోదరుడు యొక్క పవిత్రమైన ప్రేమకు , నమ్మకానికి, అనుబంధంగా,
జరుపుకునే రక్షాబంధన్ కార్యక్రమం అనాదిగా విజయానికి, సంకేతం గా భావిస్తూ, బలమైన బంధానికి అనుబంధానికి, ఆనవాలుగా మారుతూ ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు భీంపల్లి బాలరాజు, సీనియర్ ఉపాధ్యాయులు మీదే సత్యనారాయణ, కాసూలు బుచ్చాచారి, జి సురేష్, రామన్ గౌడ్, రమేష్, స్వరూప తదితరులు పాల్గొన్నారు.