16-08-2025 12:00:00 AM
బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేల వెల్లడి
ఆదిలాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి) : స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుం టూ దేశహితం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ పార్టీ కార్యాలయంతో పాటు పలు చోట్ల ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో వారు ముఖ్య అతిథిగా హాజర్యయారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, బీజేపీ ఆఫీస్‌లో ఎంపీతో కలిసి ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ... త్యాగధనుల ఆశ య సాధన దిశగా ప్రధాని మోదీ సమర్ధవంతమైన పాలన అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు లాలా మున్నా, జోగు రవి, ఆకుల ప్రవీణ్, కృష్ణ యాదవ్, బోయర్ విజయ్, వేద వ్యాస్, సునంద రెడ్డి, ధోని జ్యోతి, స్వప్న తదితరులున్నారు.