10-05-2025 03:08:04 AM
ఏడుగురు ఉగ్రవాదుల హతం
భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించారు. బీఎస్‌ఎఫ్ బలగాలు వీరి చొరబాటును భగ్నం చేశాయి. శుక్రవారం తెల్లవారుజామున చొరబాటుకు యత్నించిన ఏడుగురిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కాగా ఈ ఏడుగురికి ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌తో సంబంధాలు ఉన్నట్టు భద్రతాబలగాలు అనుమానిస్తున్నాయి.
మే 8న రాత్రి 11 ప్రాంతంలో సాంబా సరిహద్దు సమీపంలో అనుమానాస్పద కదలికలను గుర్తించిన బీఎస్‌ఎప్ దళాలు ఈ చర్యలు ప్రారంభించినట్టు సమాచారం. శుక్రవారం తెల్లవారుజామున జమ్మాకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసి, ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చినట్టు బీఎస్‌ఎఫ్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.