22-11-2025 01:57:50 AM
మంచిర్యాల, నవంబర్ 21 (విజయక్రాంతి) : మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ ఐటిఐ ప్రాంగణంలో గల ఏటిసి (అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్)నీ శుక్రవారం సాయం త్రం పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వం అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి స్వయం ఉపాధి పొందేలా అవకాశాలు కల్పిస్తుందన్నారు.
ఏ టీ సీ ల ద్వారా వివిధ ట్రేడ్ లలో నిరుద్యోగ యువతకు వృత్తి విద్య శిక్షణ అందించి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని, కోర్సు శిక్షణ అనంతరం అప్రెంటిస్ సమయంలో దాదాపు నెలకు 12 వేల వరకు వచ్చే అవకాశం ఉం టుందన్నారు. నిరుద్యోగ యువతకు వృత్తి విద్య శిక్షణ అందించి వారి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసి భవిష్యత్తులో ఉపాధి కల్పిం చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపల్ వై. రమేష్, తదితరులు పాల్గొన్నారు.