calender_icon.png 22 November, 2025 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి విద్యార్థిలో శాస్త్రవేత్త, ఇంజనీర్ ఉంటారు

22-11-2025 01:41:21 AM

- సైన్స్ ఫెయిర్ విద్యార్థుల్లో ప్రోత్సాహాన్ని నింపుతుంది 

- బీసీ వసతి గృహానికి బెడ్స్ అందించిన హరీష్ రావు

- ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్స్ ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు 

సిద్దిపేట, నవంబర్ 21 (విజయక్రాంతి): ప్రతి విద్యార్థిలో శాస్త్రవేత్త, ఇంజనీర్ ఉంటారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సూచించారు. సిద్దిపేట బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్స్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారిని అభినందించారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లా డుతూ, కంప్యూటర్ యుగం పోయి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ యుగం వచ్చిందని, ప్ర స్తుతం స్టార్ట్ ఆఫ్ యుగం కొనసాగుతుందని, డిగ్రీ, బీటెక్ చదివిన విద్యార్థులు అద్భు తమైన ఆవిష్కరణలు రూపొందిస్తున్నారని చెప్పారు. ఇన్నోవేషన్ కి ఆకాశమే హద్దుగా విద్యార్థులు కృషి చేయాలని సూచించారు.

ప్రతి ఏటా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతుందన్నారు. సిద్దిపేట విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఆవిష్కరణలు రూపొందించాలని సూచించారు. 10వ తరగతిలో జిల్లా టాప్ లో నిలవాలని, విద్యార్థులు టీవీ, సెల్ ఫోన్లు చూడొద్దని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఉపాధ్యాయులకు చా లా సమస్యలు ఉన్నాయని డీఏలు, రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వడంలేదని, జిల్లా వి ద్యాధికారులు లేరని, పిఆర్సి ఇవ్వడంలేదని ఆరోపించారు. 

బ్లాక్ స్పాట్స్ గుర్తించాలి... 

సిద్దిపేట పట్టణంలో విచ్చలవిడిగా చెత్తను రోడ్లపై పడవేస్తున్నారని ఎమ్మెల్యే హరీష్ రా వు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మున్సిపల్ అధికారులతో నిర్వహించిన స మీక్షలో ఆయన మాట్లాడారు. బ్లాక్ స్పాట్స్ గుర్తించి రోడ్లపై చెత్త వేయకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇంటి అనుమతులపై పారదర్శకంగా వ్యవహరించాలని, వారం రోజుల్లో పెండింగ్లో ఉన్న ఇంటి నెం బర్స్ దరఖాస్తులను పూర్తి చేయాలని  సూచించారు.

దక్షిణ భారతదేశంలోని సిద్దిపేట క్లీన్ అండ్ గ్రీన్ అండ్ సేఫ్ పట్టణంగా గుర్తింపు పొందాలని చెప్పారు. చెత్త సేకరణలో మార్పు జరగాలని, విచ్చలవిడిగా రోడ్ల మీద చెత్త వేస్తున్నారని, వార్డుల వారీగా అవగాహన కల్పించాలని పచ్చదనం, పరిశుభ్రత సిద్దిపేటలో నిరంతరం కొనసాగాలని చెప్పా రు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్స న్ మంజుల, వైస్ చైర్మన్ కనకరాజు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. 

హాస్టల్ విద్యార్థులకు బెడ్స్.. 

సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి ప్ర భుత్వ బీసీ వసతి గృహం విద్యార్థులకు రూ.6 లక్షల విలువ కలిగిన బెడ్స్ అందజేశా రు. విద్యార్థులకు ఇచ్చిన హామీని హరీష్ రా వు నిలబెట్టుకోవడం పట్ల విద్యార్థులు హ రీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థు లు హాస్టల్లో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డి మాండ్ చేశారు.

ఉపాధ్యాయుల కృషి అభినందనీయం... 

సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించి మాట్లాడారు. సిద్దిపేట జిల్లా నుంచి 45 మంది బాసర త్రిబుల్ ఐటీకి ఎంపిక అయితే ఇందిరానగర్ స్కూల్ నుంచే 16 మంది విద్యార్థులు ఎంపిక అవడం అభినందనీయమన్నారు. విద్యార్థుల పట్టుదల, ఉపాధ్యాయుల కృషి తోనే పాఠశాలకు గుర్తింపు లభించిందని తాను సహకారం మాత్రమే అందించగలుగుతానని సాధించేది మాత్రం విద్యార్థులని గుర్తు చేశారు.