26-10-2024 12:00:00 AM
ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్
న్యూఢిల్లీ: వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు భారత రెజ్లర్లకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 28 నుంచి అల్బనియాలో జరగనున్న ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీల కోసం 12 మందితో కూడిన భారత రెజ్లర్ల బృందం నేడు బయల్దేరి వెళ్లనుంది.
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనకుండా రెజ్లింగ్ టీమ్‌లను తొలగించడంపై శుక్రవారం కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుక్ మాండవీయను రెజ్లర్లు కలుసుకున్నారు. డబ్ల్యూఎఫ్‌ఐపై తాము చేసిన కామెంట్లను వెనక్కి తీసుకున్నామని.. ప్రపం చ చాంపియన్‌షిప్‌లో ఆడేందుకు తమకు అనుమతి ఇవ్వాలని మంత్రికి తెలిపారు.
అధికారులతో చర్చించిన మాండవీయ రెజ్లర్లు టోర్నీలో పాల్గొనేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అండర్-23 ప్రపంచ చాంపియన్‌షిప్స్ కోసం సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు డబ్ల్యూఎఫ్‌ఐ ఇటీవలే ప్రకటించింది.
అయితే రెజ్లర్లు ఈ సెలక్షన్స్‌ను వ్యతిరేకించారు. సస్పెన్షన్‌లో ఉన్న సమాఖ్య ఎలా సెలక్షన్ ట్రయల్స్ నిర్వహిస్తుందని ప్రశ్నించారు. ఇది కోర్టు దిక్కా రం కిందకు వస్తుందనడంతో డబ్ల్యూఎఫ్‌ఐ సెలక్షన్ నోటీసును ఉపసంహరించుకుంది.