calender_icon.png 11 September, 2025 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్రస్థానంలో ఆసీస్.. మూడో ప్లేస్‌‌‌‌కు భారత్

08-12-2024 11:58:18 AM

పడిపోయిన భారత్.. అగ్రస్థానంలో ఆస్ట్రేలియా

భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైట్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో ఆసీస్ విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. 19 పరుగుల టార్గెట్ ను 3.2 ఓవర్లలో చేధించింది. ఐదు టెస్టుల సిరీస్ లో 1-1 టీమిండియా, ఆస్ట్రేలియా సమంగా నిలిచాయి. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 175 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్ ముందు కేవలం 19 పరుగుల టార్గెట్ ఇచ్చింది టీమిండియా. ఈ మ్యాచ్ లో కమిన్స్ కు ఐదు వికెట్లు దక్కగా, మరోసారి నితీశ్ (42) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో టెస్టులో ఓటమి కారణంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్ మూడోస్థానానికి పడిపోయింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 60.71 శాతంతో ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరుకోగా,  59.26 శాతంతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉండగా, 57.29 శాతంతో భారత్ మూడో స్థానానికి పడిపోయింది.