calender_icon.png 26 August, 2025 | 7:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరదలపై పాక్‌ను అప్రమత్తం చేసిన భారత్

26-08-2025 02:07:52 AM

సింధూ జలాల ఒప్పందం రద్దు చేసినా మానవత్వం చాటుకున్న ఇండియా 

న్యూఢిల్లీ, ఆగస్టు 25: భారత్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంది. తావి నదికి వరదలు వచ్చే అవకాశం ఉందని దాయాది పాకిస్థాన్‌ను అప్రమత్తం చేసింది. వాతావరణ శాఖ సూచనలతో భారత హైకమిషన్ పాక్ అధికారులకు సమాచారం ఇచ్చింది. భారత సమాచారంతో పాక్ ప్రభుత్వం తావి నది పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌తో ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసిన విషయం తెలిసిందే.

అయినా భారత్ మాత్రం పాక్‌ను వరదల విషయంలో అప్రమత్తం చేసింది. భారీ వర్షాలకు జమ్మూకశ్మీర్‌లోని తావి నది ఉప్పొంగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ శాఖ అంచ నా వేసినట్టు నది ఉప్పొంగితే పాక్ లో వరదలు పోటెత్తే అవకాశం ఉం ది. పాక్‌కు సమాచారం ఇచ్చినట్టు భారత్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.