06-12-2025 12:00:00 AM
భారతదేశ చరిత్రను ప్రభావితం చేసిన ప్రముఖ వ్యక్తుల్లో డాక్ట ర్ బీఆర్ అంబేద్కర్ ఒకరు. అంబేద్కర్ పు ట్టడాని కంటే ముందే భారతదేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థి తులు అన్ని కూడా అగమ్యగోచరంగా ఉ న్నాయి. దాదాపు 2వేల సంవత్సరాలుగా భారతదేశంలో 10 శాతం ఉన్న అగ్రవర్ణాలు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం దేశ సామాజిక పరిస్థితులన్నింటిని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు.
ఈ దేశంలో 10 శాతం ఉన్న అగ్రవర్ణ పాలకులు, వారి పా లన మూలంగా భారతదేశంలో 90 శాతం ఉన్న అణగారిన వర్గాలకు స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, ప్రజాస్వామ్య గణ తంత్ర విలువలతో బతికే సమాన హక్కు లు లేవు. 10 శాతమున్న అగ్రవర్ణాలు 90 శాతం ఉన్న అణగారిన వర్గాల మెదళ్లకు బానిసత్వపు సంకెళ్లు వేసి 2వేల సంవత్సరాలుగా తమ గుప్పిట్లో పెట్టుకొని వెట్టి చాకిరి చేయించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులన్నింటిని అం బేద్కర్ సరిసమానం చేశారన్న విషయం గ్రహించాలి. దళిత కుటుంబంలో జన్మించిన అంబేద్కర్ ఎన్నో కష్టాలు పడి, ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి భారత రా జ్యాంగం అనే గొప్ప గ్రంథాన్ని రాసిన ఒక గొప్ప సంఘసంస్కర్తగా చిత్రీకరించారు.
రాజ్యాంగ దిక్సూచి..
కానీ అంబేద్కర్ అణగారిన వర్గాలకు ఏమి లక్ష్యాన్ని సాధించుకోవాలని చెప్పా డో పాఠ్యాంశాల రూపంలో చెప్పకపోవ డం దేశ అగ్రవర్ణ పాలకుల స్వార్థ బుద్ధికి నిదర్శనం. అగ్రవర్ణాలు అంబేద్కర్ స్థాయి ని ఉద్దేశపూర్వకంగా తగ్గించి రాసిన చరిత్రనే నేడు ఎందరో మేధావులు, విద్యావం తులు అదే సత్యమని కూడా నమ్ముతున్నారు.
కానీ అంబేడ్కర్ అంటే మనం గుర్తు చేసుకోవాల్సింది అతను ఒక దళితుడనో, ఎన్నో కష్టాలు కన్నీళ్లు పడి భారత రాజ్యాంగ గ్రంథాన్ని రాసి భారతదేశానికి ఒక దిక్సుచిగా మారిన ఒక సంఘసంస్కర్త గా, మహనీయుడుగా మాత్రమే చూడలేము. అంబేద్కర్ అంటే సాంఘిక సంక్షే మ హాస్టళ్లు, అంబేడ్కర్ అంటే ఉచిత స్కాలర్‌షిప్‌లు, అంబేద్కర్ అంటే రిజర్వేషన్లు అనే అంశాలనే చర్చించుకోవడమే కాదు.
అంబేద్కర్ అంటే 10 శాతం అగ్రవర్ణాలకు, 90 శాతం అణగారిన వర్గాలకు ఒక సై ద్ధాంతిక గీతను గీసి అసమానతలు పెంచి పోషించి కావాలనుకునే అగ్రవర్ణ సమాజానికి, ప్రజాస్వామ్య గణతంత్ర విలువలు కా వాలనుకునే 90 శాతం అణగారిన సమాజానికి మధ్య సామాజిక రాజకీయ సాం స్కృతిక భావాజల పోరాటం చేశారు. రాజ్యాధికారంతో సమాజాన్ని మార్చడం, సమాజంతో రాజ్యాధికారానికి రావడం ఒక సైకిల్ ప్రాసెస్ వలె సామాజిక పరివర్తన చేయడమే అంబేద్కర్‌కు ఇచ్చే ఘనమైన నివాళి అని చెప్పొచ్చు.
జ్ఞాన దినోత్సవం..
అంబేద్కర్‌ను మించిన గొప్ప దేశభక్తుడు నేటి వరకు లేడు. భవిష్యత్తులో పుడ తాడని కూడా ఆశించలేము. ఎందుకంటే భారతదేశాన్ని అంబేద్కర్ తన కుటుంబం కన్నా ఎక్కువగా ప్రేమించారు. భారతదేశం ఇవాళ ప్రపంచ పఠంలో ఒక గొప్ప స్థానం లో ఉండడానికి, ప్రపంచ ఆదర్శమైన పా లనను ప్రపంచమంతా భారతదేశం నుంచే గ్రహించాలని ఎన్నో కలలు కన్నారు. ఆ కలలను పెంచి పోషించిన అంబేద్కర్ మ హోన్నత భారత రాజ్యాంగం రూపంలో భారతదేశ ప్రజలకు ఒక గొప్ప బహుమతిని అందించాడు.
అయితే అంబేద్కర్ స్థా యిని తగ్గించడం కోసం కొందరు అగ్రవర్ణ నాయకులు అంబేడ్కర్ ఒక అణగారిన వర్గాల నాయకుడిగా తప్పుగా పాఠ్యాంశా ల్లో చిత్రీకరించారు. కానీ అంబేడ్కర్ ఒక అణగారిన వర్గాలకు మాత్రమే కాదు, భారతదేశం మొత్తానికి నాయకుడు, భారతదేశ మే గర్వించదగ్గ గొప్ప వ్యక్తుల్లో మొదటివాడు అని సగర్వంగా చెప్పవచ్చు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంతటి స్థాయి,అర్హత ఉ న్న వ్యక్తి కాబట్టే అతనిలోని జ్ఞాన శక్తిని గ్రహించి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అత్యంత ప్రముఖుల్లో ఒకరిగా ప్రపంచాని కి చూపించడం కోసమే ఐక్యరాజ్య సమితి అంబేడ్కర్ జన్మదినమైన ఏప్రిల్ 14ను ప్ర పంచ జ్ఞాన దినోత్సవంగా జరుపుకోవాల ని నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం.
సామాజిక పరివర్తన..
అంబేడ్కర్ ఒకపక్క భారతదేశం ఎల్లకా లం స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, ప్రజాస్వామ్య, గణతంత్ర భావాలతో విరజిల్లేలా కలలుగని వాటిని భారత రాజ్యాం గంలో పొందుపరిచి, ఒకపక్క బ్రిటిష్ పాలకుల మీద రాజీ పడని స్వాతంత్ర పోరాటం చేస్తూనే వచ్చారు. ఈ దేశంలో ఉన్న నాటి అగ్రవర్ణ నాయకులతో కూడా అంతే స్థా యిలో తీవ్ర పోరాటం చేయాల్సిన తప్పని పరిస్థితి నెలకొన్నది.
ఎందుకంటే బ్రిటిష్ పాలకులను వెళ్లగొట్టి ఈ దేశంలో 10 శా తం అగ్రవర్ణ నాయకులే మళ్లీ పాలకులై.. పూర్వం బ్రిటీష్ వారు భారతదేశమంతటా 90 శాతం అణగారిన సమాజాన్ని బానిసలుగా చేసుకున్నట్టే, స్వాతంత్రానంతరం కూడా అదే అణగారిన సమాజాన్ని బానిసలుగా, పాలితులుగా చేసుకోవాలనే దృ ఢమైన సంకల్పం పెట్టుకున్నారు. అందుకే అంబేడ్కర్ అణగారిన సమాజానికి హక్కు లు సాధించే క్రమంలో అలుపెరుగని పోరాటన్ని ప్రదర్శించారు. అయితే అంబేద్కర్ పోరాటానికి నాటి అగ్రవర్ణ నాయకు లు అడుగడుగునా అడ్డుకున్నారనేది భారతదేశ చరిత్రలో అంతగా బహిర్గతం కానీ విషయం అని చెప్పవచ్చు.
కానీ అలాంటి సత్యం నేటి ఆధునిక సమాజంలో తెలియకుండా, చరిత్రని అంతా కూడా తారుమా రు చేసి అంబేద్కర్ స్థాయిని తగ్గించి అగ్రవర్ణ పాలకులు తమకు అనుకూలంగా స్వాతంత్రానంతరం భారతీయ కుల వ్యవ స్థ రూపాన్ని మార్చుకొని అదే గుణాలు కలిగి ఉండడం నేడు మేధావులు, విద్యావంతులు గ్రహించాల్సిన అవసరముంది. అసమానత విలువలు పాటించే అగ్రవర్ణ సమాజం చేత సామాజిక పరివర్తన కాదని అంబేద్కర్ గ్రహించే భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఇచ్చేందుకు పాటు పడ్డారు.
అయితే తరతరాలుగా అగ్రవర్ణ సమాజం చేత బానిసలుగా, బాధితులుగా ఉన్న 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తాను కల్పించిన వజ్రాయుధమైన ఓటు ఖడ్గంతో అణ గారిన వర్గాల రాజ్యాధికారాన్ని సాధించుకొని సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాం స్కృతిక పరివర్తన చేసి భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ఉన్నత స్థానంలో ఉం డాలని, ప్రపంచానికి పెద్దన్నగా ఉండాలని అంబేద్కర్ కోరుకున్నారు. అదే తన కల కూడా అనే సందేశాన్ని ఇస్తూ, గొప్ప లక్ష్యా న్ని అణగారిన సమాజం ముందు పెట్టిన గొప్ప దార్శనికుడు అంబేద్కర్.
నిజమైన నివాళి..
ఇక భారతదేశంలో అంబేడ్కర్ భావజాలాన్ని ఆచరణాత్మకంగా నిరూపణ చేసి అంబేద్కర్ భావజాలాలను గెలిపించింది మాత్రం ఒకే ఒక్కరు.. అతడే మాన్యశ్రీ కాన్షీరాం. అంబేద్కర్ తత్వాన్ని పూర్తిగా అ ధ్యయనం చేశారు కాన్షీరాం. అయితే అం బేద్కర్ ఈ సమాజం నుంచి ఏదైతే ఆశించారో.. భారతీయ సమాజం ఎలా ఉండా లని కలలు కన్నారో.. అందరికీ తెలిసిందే. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చి ఆయన కలను నిజం చేసి నిరూపణ చేశారు కాన్షీ రాం.
మినీ ఇండియాగా పిలువబడే ఉత్తరప్రదేశ్ కేంద్రంగా భారతదేశం అంతటా కూడా అంబేద్కర్ భావజాలాన్ని వ్యాప్తి చే యడంలో కాన్షీరాం సఫలీకృతమయ్యారు. అంబేడ్కర్ భావజాలాన్ని రాజ్యాధికారాని కి తీసుకొచ్చి, సామాజిక, రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక పరివర్తన చేయడమే అంబేడ్కర్‌కు మనం ఇచ్చే నిజమైన నివాళి. ఈ విషయాన్ని నేడు పాలిస్తున్న ప్రభుత్వాలు, పాలకులు గ్రహించాల్సిన చారిత్రక సత్యం.
వ్యాసకర్త సెల్: 9553041549