04-12-2025 12:28:41 AM
ముంబై, డిసెంబర్ 3 : భారత క్రికెట్ జట్టు వెటరన్ పేసర్ మోహిత్ శర్మ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏళ్ల మోహిత్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టు లో తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో సుధీర్ఘంగా ఆడలేకపోయి నప్పటకీ ఐపీఎల్‌లో రాణించాడు. భారత్ తరపున 26 వన్డేలు ఆడి 31 వికెట్లు, 6 టీ20 ల్లో 6 వికెట్లు పడగొట్టాడు. 2015లోనే అం తర్జాతీయ కెరీర్ ముగిసినప్పటకీ ఐపీఎల్‌లో కొనసాగుతూ వచ్చాడు. ఐపీఎల్‌లో 120 మ్యాచ్‌లు ఆడి 134 వికెట్లు తీశాడు.