01-11-2025 08:16:51 PM
నిర్మల్,(విజయక్రాంతి): సోయా కొనుగోళ్లపై రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోయా పంటను ప్రభుత్వం నిర్ణయించిన తేమ శాతం ప్రకారం కొనుగోలు చేస్తామని, రైతులు ఆ ప్రమాణాలకు అనుగుణంగా పంటను మార్కెట్‌యార్డుకు తీసుకురావాలని సూచించారు. మండల స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు టోకెన్లు జారీ చేస్తున్నారని, ఆ టోకెన్ల ప్రకారం నిర్ణయించిన తేదీల్లోనే రైతులు తమ పంటను తీసుకురావాలని తెలిపారు. కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా, పారదర్శకంగా జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని సోయా పంటను మొత్తంగా కొనుగోలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. పంట కొనుగోళ్లపై తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు.