11-07-2025 12:00:00 AM
పటాన్ చెరు, జులై 10 : జిన్నారం మండలం ఊట్ల గ్రామ పంచాయతీ దాదిగూడెం గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో మహిళా శక్తి సంబరాలపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పొదుపు సంఘాల మహిళలకు ఆట, మాట, పాట ద్వారా అవగాహన కల్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళల కోసం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. ఐకేపీ ఏపీఎం నరేందర్, సీసీలు బేబీ, భారతి, సుజాత, వీవోఏలు నిర్మల, సాంస్కృతిక సారథి కళాకారులు సునీల్, నీరుడి దుర్గేశ్, డీ రమేశ్, ఎస్ మల్లేశ్, ఏర్పుల వినేశ్, పటేల్ సంద్య, గౌని శంకర్, భామిని, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.