11-07-2025 12:00:00 AM
82 బైకులు, రెండు కార్లు..మద్యం స్వాధీనం
మనోహరాబాద్, జూలై 10 : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం మేజర్ గ్రామ పంచాయతీ కాళ్ళాకల్ లో గురువారం తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో సరైన పత్రాలులేని 82 బైకులు, రెండు కార్లు సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు రెండు బెల్ట్ షాపులను తనిఖీ చేసి 285 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ రంగాకృష్ణ, స్థానిక ఎస్త్స్ర సుభాష్ గౌడ్, తూప్రాన్ ఎస్‌ఐ శివానందం, పోలీస్ సిబ్బంది ఉన్నారు.