calender_icon.png 8 November, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌హెచ్‌జీ సభ్యులకు ఇందిరా మహిళాశక్తి చీరలు

08-11-2025 12:13:08 AM

  1. సిద్ధమవుతున్న 64 లక్షల చీరలు

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 07(విజయక్రాంతి): రాష్ట్రంలోని అన్ని మహిళా సంఘా ల సభ్యులకు పంపిణీ చేసేందుకు ఇందిరా మహిళా శక్తి చీరలు.యూనిఫామ్స్ సిద్ధవుతున్నాయని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘా ల పంపిణీ చేసే ఇందిరా మహిళా శక్తి చీరల యూనిఫామ్స్ ఉత్పత్తి ప్రక్రియ, ఇతర అంశాలను నేరుగా తెలుసుకునేందుకు రాష్ట్రంలోని 32 జిల్లాల నుంచి జిల్లా సమాఖ్య అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు జిల్లాకు రాగా, వారితో జిల్లా సమీకృత కార్యాలయాల స ముదాయంలో శుక్రవారం ఇంచార్జి కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ఇందిరా మహిళా శక్తి కింద మహిళ లకు చీరలు అందజేయడంతో ఇటు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని వెల్లడించారు. వస్త్ర పరిశ్రమకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. కార్మికులు ఎంతో నైపుణ్యంతో చీర లు నేస్తారని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వ ల క్ష్యం మేరకు ఇందిరా మహిళ శక్తి కింద జిల్లాలోని మహిళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీ న్లు, డైరీ యూనిట్, కోడి పిల్లల పెంపకం, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంక్, ఇతర స్వ యం ఉపాధి యూనిట్లను అందజేశామని తెలిపారు.మహిళలు ఆర్థికంగా వృద్ధి చెంది తే తమ కుటుంబంతోపాటు సమాజ అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి పథకంలో మహిళలను భాగస్వామ్యులను చేస్తుందని వెల్లడించారు. ప్రతి ఎస్ హెచ్ జీ మహిళా రుణాలను తీసుకొని సద్వినియో గం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి మహిళా ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధిం చి, మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. 

వస్త్ర ఉత్పత్తి పరిశీలన

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వెంకట్రావునగర్ లోని మరమగ్గాల యూనిట్, గీతానగర్ లోని ప్రాసెసింగ్ యూనిట్, వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాంను పరిశీలించారు. ఇందిరా మహిళా శక్తి మరమగ్గాల పై సిద్ధం అవుతున్న చీరలను ఇంచార్జి కలెక్టర్, ఆయా జిల్లాల మహిళా సంఘాల బాధ్యులు నేరు గా పరిశీలించారు. దారం నుంచి చీరల త యారయ్యే విధానాన్ని చూసి, దాని వివరాలను కార్మికులు, యజమానులను మహిళ లు అడిగి తెలుసుకున్నారు.

తాము వివిధ రకాల చీరలు కొనుగోలు చేసి వినియోగిస్తామని, మొదటి సారి వాటి తయారీ ప్రక్రియ, ఇతర దశలు, ప్యాకింగ్, గోదాము ను నేరు గా చూసే అవకాశం వచ్చిందని తెలిపారు. కార్మికుల నైపుణ్యం, తయారీ విధానంపై అ వగాహన వచ్చిందని పేర్కొన్నారు. ఎంతో నాణ్యతతో ఇందిరా మహిళా శక్తి చీరలు సిద్ధమవుతున్నాయని వివరించారు.

కార్యక్రమం లో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, చేనేత జౌళి శాఖ జేడీ వెంకటేశ్వర్ రావు, డీఆర్డీఓ శేషాద్రి, అదనపు డీఆరీ ్డఓ శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ ఏడీ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.