calender_icon.png 25 October, 2025 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి పట్టణంలో భారీ ఎత్తున 8.2 Km సైకిల్ ర్యాలీ నిర్వహణ

25-10-2025 07:49:36 PM

పోలీసు అమరులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలి 

స్వయంగా సైకిల్ ర్యాలీ నందు పాల్గొని, ర్యాలీ పూర్తి చేసి, సిబ్బందికి ఆదర్శప్రాయంగా నిలిచిన జిల్లా ఎస్పీ

300 సైకిల్ లతో పట్టణ దారి గుండా అమరవీరులకు జోహార్లు తెలుపుతూ కొనసాగిన సైకిల్ ర్యాలీ

కామారెడ్డి (విజయక్రాంతి): పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా శనివారం ఉదయం 8.45 గంటలకు కామారెడ్డి స్వాగత తోరణం నుండి (పొందుర్తి) ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర ఐపిఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా శనివారం సైకిల్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సైకిల్ ర్యాలీ ముఖ్య ఉద్దేశం పోలీసు అమరవీరులు చేసిన త్యాగాలను, కఠినతరమైన విధులను ప్రతి ఒక్కరికీ  తెలియజేయాలనే  ఉద్దేశంతో నిర్వహించడం జరిగింది.

ఈ ర్యాలీ పొందుర్తి-కామారెడ్డి ఎంట్రన్స్‌ నుంచి ప్రారంభమై జి.ఆర్. కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నిజాంసాగర్ చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం ముందు, బస్టాండ్ ముందు, సరస్వతి శిశు మందిర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ముందు గుండా సాగి కళాభారతి వద్ద ముగిసింది. పోలీసు అమరవీరులను త్యాగాలు స్మరించుకుంటూ, నిరంతరం ప్రజలలో చిరస్మరణీయంగా ఉండటానికి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలలో పోలీసుల సత్సంబంధాలను మెరుగుపరుచుకుంటూ, పబ్లిక్ పోలీస్ రిలేషన్ ను మరింత పెంపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి అదనపు ఎస్పీ కే నరసింహ రెడ్ది, ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, ఐపీఎస్, బాన్సువాడ డీఎస్పీ బి. విట్టల్ రెడ్డి , ఇన్‌స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, సిబ్బంది, వివిధ కాలేజీల విద్యార్థులు, యువకులు ఉత్సాహంగా పాల్గొని అమరవీరులకు ఘనమైన  నివాళులు అర్పించారు..