calender_icon.png 25 October, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాస్టిక్ కాలుష్యం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన

25-10-2025 07:49:39 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని కొలనూర్ (రాజన్న గొల్లపల్లి) మార్గదర్శి విద్య నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు ప్లాస్టిక్ వాడకంపై వినూతన కార్యక్రమాన్ని చేపట్టారు.ప్రజల వద్దకు వెళ్లి మాటల ద్వారా పాటల ద్వారా నృత్యాల ద్వారా వివిధ వేషధారణలు వెళ్లి ప్లాస్టిక్ వాడకూడదని వాడితే దాని వల్ల వచ్చే అనర్థాలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మండల చిరంజీవి మాట్లాడుతూ ప్రస్తుతం ప్లాస్టిక్ మన జీవితంలో ఒక ముఖ్య భాగం అయిపోయిందని ఆహార పదార్థాలు నిలువ చేయడం ద్వారా అనేక ఇతర అవసరాలకు ప్లాస్టిక్ ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారని దీనివల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని భూగర్భ జలాలు కలుషితం కావడం కాలువలు కూరుకుపోవడం జంతువులు పక్షులు ప్లాస్టిక్ ను తినడం వల్ల ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ప్లాస్టిక్ సంచులకు బదులు వస్త్ర సంచులు ఉపయోగించాలని వీలైనంతవరకు ప్లాస్టిక్ ను తగ్గించి భవిష్యత్తు తరాలకు పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని తెలియజేశారు.