calender_icon.png 27 December, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసంపూర్తి భవనాలను పూర్తి చేయాలి

27-12-2025 12:11:23 AM

మంత్రి సీతక్కకు వినతి

ములకలపల్లి, డిసెంబర్ 26, (విజయక్రాంతి):ములకలపల్లి మండలంలో అసంపూర్తిగా ఉన్న పది గ్రామ పంచాయతీల కార్యాలయాల భవనాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ బి ఆర్ ఎస్ నాయకులు మంత్రి సీతక్కకు వినతి పత్రాన్ని అందజేశారు. సీతాయిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొనేందుకు గురువారం రాత్రి గ్రామానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్,శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూర్య (సీతక్క ) ను వారు కలిసి వినతిని అందజేశారు.

మండలంలోని 10 గ్రామ పంచాయితీల నూతన భవనాలు మూడు సంవత్సరాలుగా అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్నాయని, కార్యాలయాల పనులు త్వరితగతిన పూర్తి చేసి గ్రామ పంచాయతీలలోని ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని వారు కోరారు. వినతి పత్రం అందచేసిన వారిలో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మోరంపూడి అప్పారావు,కుంజా వెంకటేష్, కీసరి శ్రీను, గొగ్గల చంద్రం ఉన్నారు.