23-05-2025 01:08:49 AM
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల , మే 22 : అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం చేవెళ్ల మండల పరిధి సింగప్పగూడ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన, శంకర్పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు, శంకర్పల్లి మండల పరిధి గోపులారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన, అర్హత పత్రాలను ఎమ్మెల్యే కాలె యాదయ్య అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. నిరుపేదలై అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని అన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని పేదలకు న్యాయం చేస్తామని తెలిపారు.
ఆయా కార్యక్రమాల్లో చేవెళ్ల, శంకర్పల్లి ఎంపీడీవోలు హిమబిందు, వెంకయ్యగౌడ్, శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్ యోగేశ్, చేవెళ్ల వ్యవసాయ మార్కెట కమిటీ చైర్మన్ పెంటయ్యగౌడ్, చేవెళ్ల, ముడిమ్యాల్, పీఏసీఎస్ చైర్మన్లు దేవర వెంకట్రెడ్డి, గోనె ప్రతాప్రెడ్డి, మాజీ జడ్పీటీసీ మాలతికృష్ణారెడ్డి, కాంగ్రెస్ చేవెళ్ల మండల అధ్యక్షుడు వీరేందర్రెడ్డి, మాజీ సర్పంచ్లు శైలజాఆగిరెడ్డి, వెంకటేశం గుప్తా, జహంగీర్, మైనార్టీ నాయకుడు అలీ, స్థానిక నేతలు పాల్గొన్నారు.