calender_icon.png 23 May, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బలహీనవర్గాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

23-05-2025 01:07:16 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

తలకొండపల్లి,మే 22: రాష్ట్రంలో వెనుకబడిన,బలహీన వర్గాల అభివృద్దే కాంగ్రేస్ ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గురువారం స్తానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రేస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయ కత్వంలో అన్నిరంగాలలో ముందుకు వెళుతుందన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటిలను దశలవారీగా అమలు చేస్తున్నామని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రేస్ ప్రభుత్వం అదికారం లోకి వచ్చి తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కల్వకుర్తి నియోజకవర్గంలో అభివృద్ది పనులకోసం  రూ.600 కోట్ల నిదులు మంజూరు చేయించినట్లు నారాయణరెడ్డి చెప్పారు.గత బిఆర్‌ఎస్ ప్ర భుత్వ హయంలో తలకొండపల్లి మండలంలో డంపింగ్ యార్డ్ నిర్మించేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు.

అప్పుడు తను ఎమ్మెల్సీగా ఉండడంతో దానిని అడ్డుకున్నానని తెలిపారు.అదేప్రాంతంలో ఇప్పుడు రూ.200 కోట్ల నిదులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించినట్లు వివరించారు.త్వరలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్తాపన చెడానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రానున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.నియోజకవర్గంలోని ఆయా గ్రామాలలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల  నిర్మాణాన్ని లబ్దిదారులు త్వరిత గతిన పూర్తి చేయాలని సూచించారు.

జంగారెడ్డిపల్లి గ్రామానికి మొదటి విడత కింద 18 ఇండ్లు మజూరయ్యయని,మంజూరైన ఇండ్ల దృవ పత్రాలను ఎమ్మెల్యే నారాయణరెడ్డి లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్ మార్కెట్ కమిటి చైర్మన్ యాట గీతనర్సింహ,తహసిల్దార్ నాగార్జున,ఎంపిడీఓ శ్రీకాంత్,మండల పార్టీ అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి,మాజీ సర్పంచ్ వరలక్ష్మిరాజేందర్ రెడ్డి,మాజీ ఎంపిటిసి దాసరియాదయ్య,రఘురాములు,డేవిడ్,చంద్రారెడ్డి,హరి మోహన్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.