08-01-2026 01:07:47 AM
తాడ్వాయి,జనవరి,7 ( విజయ క్రాంతి ): అర్హులైన ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందని ప్రతినిధులు తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో బుధవారం ఇందిరమ్మ ఇండ్లకు ప్రతినిదులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... అరులైన నిరుపేదలు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు.
ఇప్పటికే తాడ్వాయిలో 46 ఇండ్లు పూర్తయ్యాయని వారు తెలిపారు. మరో 50 ఇండ్ల మంజూరు కోసం ఎమ్మెల్యే కు ప్రతిపాదనలు పెట్టుకున్నామని అవి సైతం మంజూరు అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మెట్టు విజయ రాములు, ఉప సర్పంచ్ రనిల్ రెడ్డి నాయకులు అంబీర్ శ్యామ్ రావు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు