08-01-2026 01:09:26 AM
మండల అధ్యక్షులు వడ్డే రాజు
నాగిరెడ్డిపేట్,జనవరి 7 (విజయ క్రాంతి): నాగిరెడ్డిపేట్ మండలం వడ్డెర సంఘం నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.మండలం వడ్డెర సంఘం అధ్యక్షులుగా వడ్డెర రాజు,ఉపాధ్యక్షులుగా వడ్డెర వెంకట్,మండల సలహాదారులుగా ఇరుగదొడ్ల రాజు,కార్యదర్శిగా ధారంగుల సాయిలు,కోశాధికారిగా ఒల్లెపు రాజులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా నాగిరెడ్డిపేట్ మండలం వడ్డెర సంఘం అధ్యక్షులు వడ్డెర రాజు మాట్లాడుతూ...తనకు మండల బాధ్యతలు ఇచ్చినందుకు బాధ్యతయుతంగా పనిచేసి వడ్డెర సంఘం కోసం పోరాడుతానని,వడ్డెర సంఘానికి కలిగే నష్టాల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.ఈ కార్యక్రమంలో చిన్నపూర్ సర్పంచ్ సప్తగిరి నాగయ్య, కొట్టాల రాంపూర్ మాజీ సర్పంచ్ కిషన్,ఆయా గ్రామాల వడ్డెర సంఘం నాయకులు పాల్గొన్నారు.