calender_icon.png 5 August, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు సాధ్యం

04-08-2025 10:18:53 PM

వెంపటి అక్కాచెల్లెళ్లకు 50,000 ఆర్థిక సాయం పట్ల సర్వత్ర హర్షం..

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు..

తుంగతుర్తి (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు ఇందిరమ్మ ఇల్లు సాధ్యమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు(MLA Mandula Samuel) అన్నారు. సోమవారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో సుమారు 30 కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా లబ్ధిదారుల కవిత కుటుంబానికి ముగ్గు పోసి, భూమి పూజ కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు, మహాలక్ష్మి పథకం, రైతు రుణమాఫీ రైతు భరోసా ఉచిత కరెంటు ఉచిత సన్న బియ్యం నూతన కార్డుల పంపిణీ, 5 లక్షల వ్యయంతో బడుగు బలహీన వర్గ ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించుటకు మంజూరు చేయడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. గడిచిన తొమ్మిది సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి ఒక రేషన్ కార్డు ఇవ్వని చరిత్ర టిఆర్ఎస్ పార్టీ దేనని ఎద్దేవా చేశారు.

దళితులకు ఏబిసిడి వర్గీకరణ, బీసీలకు 42 శాతం ప్రకటించి పార్లమెంటులో ఆమోదం పొందుటకు, ముఖ్యమంత్రి మంత్రులతో సహా కలిసి ధర్నా నిర్వహించడం చారిత్రాత్మకమైన నిర్ణయమని అన్నారు. కేతిరెడ్డి కాల్వ మంజూరు పనుల నిమిత్తం సుమారు 5కోట్ల 80 లక్షల నిధులు మంజూరు చేసినట్లు, సంబంధిత అధికారితో ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు. అనంతరం వెంపటి దళిత కుటుంబానికి చెందిన ఇరువురు అక్కచెల్లెళ్లకు 50 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, తుంగతుర్తి మార్కెట్ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు మాజీ ఎంపీటీసీ కేతిరెడ్డి లతా విజయకుమార్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షుడు చిలకల వెంకన్న, దాయం ఝాన్సీ రెడ్డి కేతిరెడ్డి రవీందర్ రెడ్డి గుమ్మడవెల్లి సోమన్న మాచర్ల అనీలు కొండారాజు స్థానిక ఎంపీడీవో శేషు, మాజీ సర్పంచ్ వెంకన్న దాసరి శ్రీను సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.