calender_icon.png 5 August, 2025 | 1:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటై భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు

04-08-2025 10:22:26 PM

ముత్తారంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో ఎస్ఐ నరేష్..

ముత్తారం (విజయక్రాంతి): యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ముత్తారం ఎస్సై గోపతి నరేష్(SI Gopathi Naresh) సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని చౌరస్తాలో ఎస్ఐ  కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ, గ్రామంలోని ప్రజలకు అత్యవసర సమయంలో పోలీస్ సహాయం పొందాలని భావించినప్పుడు డయల్ 100 కు కాల్ చేయలని, దగ్గరలో ఉన్న బ్లూ కొల్ట్స్ సిబ్బంది నిమిషాల వ్యవధిలోని వచ్చి తగు చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు.

వాహనదారులు తప్పని సరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని, చిన్న చిన్న రోడ్డు సేఫ్టీ నియమాలు పాటించకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయి కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైనప్పుడు వెంటనే 1930కు సమచారం అందించాలని కోరారు. దేశ భవిష్యత్తు ను నిర్ణయించే యువత చెడు వ్యసనాలకు వఅలవాటు పడి, డబ్బు కోసం నేరాల వైపు వెళ్ళి విలువైన భవిష్యత్తు ను నాశనం చేసుకుంటున్నారి అన్నారు. గ్రామంలో ఎవరైనా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు వాడుతున్న, సరపరా చేస్తున్నట్లు గుర్తించిన పోలీస్ వారికి సమచారం అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ అశోక్, రాజా కుమార్, సుమంత్ రెడ్డి, హోమ్ గార్డ్ గోపాల్ పాల్గొన్నారు.