04-08-2025 10:15:59 PM
సీజనల్ వ్యాధులను అరికట్టండి.
సిపిఐ వినతి..
కొత్తగూడెం (విజయక్రాంతి): కార్పొరేషన్ పట్టణ పరిధిలోని అన్ని డివిజన్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు మెరుగుపరచాలని సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కమిషనర్ సుజాత(Commissioner Sujatha)కి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. సిపిఐ పట్టణ కార్యదర్శి కంచర్ల జములయ్య మాట్లాడుతూ, ప్రజలు ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారని, అద్వాన్నంగా ఉన్న పారిశుధ్యం మెరుగుపరిచి అన్ని డివిజన్లో దోమమందును, పిచికారి చేయించి, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని తెలిపారు. అలాగే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అన్ని డివిజన్లో కుక్కలు, కోతుల, బెడతతో ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు.
వీటి నివారణ కోసం సత్వరమే, తగు చర్యలు తీసుకోవాలని వివరించారు. నిలిచిపోయిన చెత్త వాహనాలు అన్నింటిని రిపేర్ చేయించి వినియోగంలోకి, తీసుకురావాలని కోరారు. భగీరథ పైప్లైన్ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో, కాలువలు కూలిపోయి కాలువల్లో మురుగునీరు పేరుకుపోయి, అద్వాన్నంగా ఉన్నాయని తక్షణమే కాలువలను పునరుద్ధరించి, ఆయా ప్రాంతాల్లో పరిశుద్ధ పనులు మెరుగుపరచాలని కమిషనర్ కి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శులు, మునిగడప వెంకటేశ్వర్లు, పిడుగు శ్రీనివాస్, మాచర్ల శ్రీనివాస్, వన్ టౌన్ సహాయ కార దర్శి కోలాపూర్ ధర్మరాజు, 3 టౌన్ సిపిఐ కార్యదర్శి మహమ్మద్ యూసుఫ్ ,సహాయ కార్యదర్శులు సత్యనారాయణ చారి, బోయిన విజయ్ కుమార్, నాయకులు అజీజ్ తదితరులు పాల్గొన్నారు.