12-07-2025 12:39:39 AM
అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో
మహబూబాబాద్, జూలై 11 (విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని, ప్రొసీడింగ్స్ అందించిన లబ్ధిదారుల చేత ఇండ్ల నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, మహబూ బాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో ఆదేశించారు. మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టణంలోని 9 వ వార్డులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతున్నా యని, మరింత వేగం పెంచి, ప్రభుత్వ సూచించిన దశలవారీగా నిర్మాణం పూర్తి అయిన ఇండ్ల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి బిల్లులు త్వరగా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు.
జిల్లాలోనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, హెల్త్ సబ్ సెంటర్స్‌లలో ప్రస్తుత వాతావరణ పరిస్థితు ల మార్పుల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత ్తలు తీసుకో వాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరం ఉన్నచోట వైద్య పరీక్షల క్యాంపు నిర్వహించాలని, ఇంటింటికి ఆరోగ్య సర్వే నిర్వహించాలని సూచించారు.
గ్రామ పంచాయతీలు మున్సిపల్ పరిధిలో అన్ని గ్రామాలలో పరిశుభ్రత వారోత్సవాలు నిర్వహిస్తూ, షెడ్యూలు ప్రకారం సానిటేషన్ నిర్వహించాలని సూచించారు. అన్ని వసతి గృహాలలో చదువుతున్న పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఆరోగ్య సమస్యలు రాకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని, ముందస్తుగా తగినన్ని మందులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ ల వివరాలను పరిశీలించారు. మందుల స్టాక్ వివరాలను తనిఖీ చేశారు. సాధారణ ప్రసవలను ప్రోత్సహించాలని, మాత శిశు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట తహసిల్దార్ కృష్ణవేణి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.