31 August, 2026 | 4:20 PM

నాలుగు రోజులు వర్షాలే

12-07-2025 12:40 AM

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురువనున్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేసింది. శనివారం పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీస్తూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.