calender_icon.png 27 July, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలి

26-07-2025 06:34:30 PM

అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు..

వలిగొండ (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా పంచాయతీ రాజ్ అడిషనల్ కలెక్టర్ భాస్కర రావు(Additional Collector Bhaskara Rao) అన్నారు. శనివారం వలిగొండ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని మంజూరు కావడం జరిగిందో, ఎన్ని ప్రారంభించారు, ఎన్ని బేస్మెంట్ లెవెల్ వరకు వచ్చాయో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందిరమ్మ నిర్మాణం పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఇంటి నిర్మాణం యజమానులను ప్రోత్సహించి నిర్మాణం త్వరగా పూర్తి అయ్యేలా చూడాలన్నారు. అనంతరం కలెక్టర్ భాస్కరరావును ఎంపీడీవో జలంధర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కందుల నాగరాజు, బిల్ కలెక్టర్ బాబు శాలువాతో సన్మానించారు.