09-05-2025 12:07:50 AM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్,మే 8(విజయ క్రాంతి): నిరుపేదలకు ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హత గల లబ్ధిదారుల పేర్లు మాత్రమే ఉండాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం ఆసిఫాబాద్ పట్టణంలో 5వ వార్డు పరిధిలోని బజార్ వాడిలో ఇందిరమ్మ ఇండ్ల జాబితా లో పేరు గల దరఖాస్తుదారురాలు సాహెరా బేగం ఇంటిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ.. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హత గల లబ్ధిదారులకు సొంత ఇంటి స్థలం కలిగి ఉండాలని, నిబంధనల ప్రకారం 600 చదరపు అడుగులలోపు ఇంటి నిర్మాణం చేప ట్టాలని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం లో భాగంగా రూపొందుతున్న అర్హుల జాబితాలో అర్హత కలిగిన వారి పేర్లు మాత్రమే ఉండాలని పరిశీలన అధికారి రాజ్ కుమార్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, దరఖాస్తుదారులు తదిత రులు పాల్గొన్నారు.