calender_icon.png 27 August, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విఘ్నాలు తొలగించు.. వినాయక

27-08-2025 02:51:48 AM

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మాజీ సీఎం కేసీఆర్

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వినాయక చవితి శుభాకాంక్ష లు తెలిపారు. భక్తులు తమ ప్రతి ప్రయత్నం విజయంతం కావడానికి, అడ్డంకులు తొలగించమని విఘ్నేశుడిని ప్రార్థించనున్నట్టు తెలిపారు. అలాగే సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలోని విఘ్నాలను తొలగించి అందరికీ ఆనందం, ఐశ్వ ర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని విఘ్నేశ్వరుడుని ప్రార్థించారు.

వాడవా డలా వెలిసే గణేశ్ మండపాలలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని కోరారు. రాష్ర్ట ప్రజలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వినా యక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఇళ్లలో మట్టి వినాయకుడిని పూజించాలని భట్టి పిలుపునిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా చవితి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభీక్షంగా ఉండాలని, వ్యవసాయం కలిసి వచ్చి, రైతన్నల కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లివిరిసేలా దీవించాలని ప్రార్థించారు.