calender_icon.png 27 August, 2025 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికకు జగ్గారెడ్డి ఆర్థికసాయం

27-08-2025 02:49:27 AM

వైద్యం కోసం రూ.3 లక్షలు అందజేత

ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సాయం చేస్తా 

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): క్యాన్సర్ వ్యాధితో పాటు ఇతర ఆనారోగ్య సమస్యలతో బాధపడే పేదవారికి వైద్య ఖర్చుల కోసం ఆర్థికంగా సాయం ఆదుకునే  పీసీసీ వర్కింగ్ జగ్గారెడ్డి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ గ్రామానికి చెందిన సుష్మ 9 ఏళ్లుగా అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమైది. విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి మెరుగైన  చికిత్స కోసం మంగళవారం బాలిక తండ్రి మహేశ్‌కు గాంధీభవన్‌లో రూ. 3 లక్షల ఆర్థిక సాయం చేశారు.

డాక్టర్ చంద్రశేఖర్‌తో జగ్గారెడ్డి ఫోన్‌లో మాట్లాడి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయాలని అవసరమైతే తాను మరికొంత ఆర్థిక సాయం చేస్తానన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పూర్తి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించే విధంగా చూస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. ఇంకెవరైనా ఆర్థిక సాయం చేయాలనుకునే వాళ్లు బాలిక తండ్రి మహేశ్ (నెంబర్ 9552461480)కు కాంట్రాక్టు కావాలని జగ్గారెడ్డి సూచించారు. అయితే దసరా పండుగ రోజున అమ్మమ్మ ఇంటికి వెళ్లిన సుష్మ అనుకోకుండా జరిగిన పొరపాటున చీమల మందు కలిపిన చపాతీ తిని తీవ్ర అనారోగ్యం పాలైందని తెలిపారు.