11-05-2025 12:24:11 AM
అమరులైన వీర సైనికులకు ఘన నివాళి
మాజీ మంత్రి ఏ ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్,(విజయక్రాంతి): భారతదేశంపై పాకిస్తాన్ సైన్యం జరుగుతున్న దాడులను సమర్థవంతంగా తిప్పి కొడుతున్న ఆపరేషన్ సిందూర్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రజలు అండగా నిలవాలని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ న్యాయశాఖ మాజీ మంత్రి ఇంద్రకన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన నివాస భవనంలో ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన భారత జవాన్లకు ప్రజలకు సంతాపాన్ని ప్రకటించారు.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో టూరిస్టులు ప్రజలపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. దాడి చేసిన ఉగ్రవాద సాధారణ పై భారత ప్రభుత్వం వివిధ దళాల సైన్యం స్థావరాలను ధ్వంసం చేసి ఉగ్రవాదానికి వ్యతిరేక మనీ భారతదేశం వివరిస్తుందని తెలిపారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం వ్యతిరేకంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఎందుకు కార్యక్రమాన్ని విజయం దిశగా నడిపిస్తున్న భారత భారత సైన్యానికి ప్రజలందరూ కూడా అండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ తరఫున తన సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ కోరుకుంటున్నాను తెలిపారు.
భారతదేశ ప్రజల కోసం కంటికి రెప్పలా కాపాడుతున్న భారత సైన్యం ప్రపంచంలోనే ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన వ్యవస్థ అన్నారు తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత సైన్యానికి అండగా నిలుస్తూ అనేక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. గత నాలుగు రోజులుగా పాకిస్తాన్ సైన్యం జరిపిన దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పి కొట్టిందని గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూరం అమరులైన ప్రతి ఒక్కరి త్యాగం మర్చిపోలేని వారి కుటుంబాలకు భారత ప్రభుత్వం ప్రజలు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ధర్మాజీ రాజేందర్ ముడుసు సత్యనారాయణ పాకాల రామచందర్ శ్రీకాంత్ యాదవ్ మైపాల్ రెడ్డి అనుముల భాస్కర్ రమణ రెడ్డి శ్రీధర్ తదితరులు ఉన్నారు