11-05-2025 12:22:48 AM
-భోలక్పూర్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు వై.శ్రీనివాస్‌రావు
ముషీరాబాద్, మే 10 (విజయక్రాంతి) : పాకి స్తాన్ భారత్ దేశాల మధ్య జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ -2 పోరాటంలో అమరులైన తెలుగు రాష్ట్రాలకు చెందిన సచిన్ యాదవ్, మురళీ నాయక్ జవాన్లు వీర మరణం పొంది దేశానికి రక్షణగా నిలిచారని బోలక్పూర్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్య క్షుడు వై.శ్రీనివాస్ రావు అన్నారు.
శనివారం భోలక్పూర్ డివిజన్‌లోని రంగానగర్ కమ్యూనిటీ హాల్లో జమ్మూకాశ్మీర్ లో పాక్ కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ సచిన్ యాదవ్, మురళీ నాయక్ లకు నివాళులర్పించి మౌనం పాటించారు. ఈ సందర్భంగా వై. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ... పాకిస్తాన్ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని విమర్శించారు.
ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ -2 ప్రపంచ దేశాలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయన్నారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాల ను ఓదులుతున్న సైనిక కుటుంబాలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ భోలక్ ప్పూర్ డివిజన్ ఇన్చార్జి దీన్ దయాల్ రెడ్డి, రాష్ట్ర నాయ కుడు రహీం, డివిజన్ బీసీ సెల్ అధ్యక్షుడు ఉమాకాంత్, డివిజన్ మాజీ అధ్యక్షుడు మహ్మద్లీ తదితరులు పాల్గొన్నారు.