calender_icon.png 10 September, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మౌలికవసతులు-, నాణ్యమైన భోజనం అందించాలి

10-09-2025 12:08:41 AM

గోపాలపేట బాలికల హాస్టల్‌ను సందర్శించిన కలెక్టర్ 

గోపాలపేట సెప్టెంబర్ 9 : వసతి గృహాల్లో మౌలిక వసతులతోపాటు విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. మంగళవారం వసతి గృహాలు అసభ్యంగా ఉన్నాయని సౌకర్యాలను సంబంధిత ప్రిన్సిపాల్ లు చూడటం లేదని విజయ క్రాంతిలో వచ్చిన కథనానికి వనపర్తి జిల్లా కలెక్టర్ గోపాలపేటలోని బాలికల వసతి గృహాన్ని సందర్శించారు.

వసతి గృహంలో విద్యార్థులు ఉండే గదులను పరిసర ప్రాంతాలను కలెక్టర్ ఆదర్శ సురభి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద విద్యార్థులను వారి తల్లిదండ్రులు బ్రతుకుతెరువు కొరకై ఉలసలు వెళ్లి తమ పిల్లలు బాగా చదువుకోవాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి గృహాల్లో చేర్పించి వెళ్తుంటారు. కాబట్టి వారి చదువుతోపాటు వారికి కావాల్సిన మౌలిక వసతులు మంచి భోజనం అందించేదే బాధ్యత మనదేనని అన్నారు.

కాబట్టి విద్యార్థులను కంటికి రెప్పలా చూసే బాధ్యత ప్రిన్సిపాల్ పైనే ఉంటుందని చెప్పారు. విద్యార్థుల విషయంలో ఏది తక్కువైనా ప్రిన్సిపాల్ పైనే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రిన్సిపాల్ కు సూచించారు. ఇటీవల వర్షాలు కురవడం వల్ల గదుల్లోకి నీరు చేరిందని అప్పుడు మాత్రమే విద్యార్థులకు ఇబ్బందిగా ఉన్నదని ప్రిన్సిపాల్ జీవిత కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అందించిన కలెక్టర్ వెంటనే కరువైన మౌలిక వసతులకు అలాగే ప్రహరీ గోడ నిర్మాణాలకు మరమ్మత్తుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎంపీడీవో తాసిల్దార్ కి సూచించారు కార్యక్రమంలో ఎంపీడీవో భావన తాసిల్దార్ పాండు ఉన్నారు.