calender_icon.png 22 May, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత

21-05-2025 12:00:00 AM

  1. యువత ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి

ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, మే 20 (విజయక్రాంతి): యువత చెడు మార్గంలో పయనించకుండా ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ భగవంతుడి సన్నిధిలో గడపాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌లోని బంగారు గూడలో నిర్వహించిన హను మాన్ పల్లకి శోభాయాత్రలో శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నా రు.

పెద్ద ఎత్తున హాజరైన భక్తులు, హనుమాన్ దీక్ష దారుడు భక్తిశ్రద్ధలతో హనుమా న్ పల్లకి సేవ కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భక్తులతో కలిసి పల్లకిని మోస్తూ పల్లకి సేవలు తరించారు. 

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆం జనేయ స్వామి కృపతో ప్రజలంతా సుభిక్షం గా జీవించాలని ఆకాంక్షించారు. ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత నెలకొంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీనివాస్ యాదవ్, కృష్ణ, శ్రీనివాస్, అశోక్ రెడ్డి, మహిళలు పాల్గొన్నారు.