06-01-2026 05:00:50 PM
నూతనకల్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ మహేశ్వరం మల్లికార్జున్ ముఖ్యఅతిథిగా హాజరై, చిన్నారులతో అక్షరాలు దిద్దించి విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... మూడు సంవత్సరాలు నిండిన ప్రతి బిడ్డను తప్పనిసరిగా అంగన్‌వాడీ కేంద్రానికి పంపాలని తల్లిదండ్రులను కోరారు.
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తోందని గుర్తు చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాలను గర్భిణీలు, బాలింతలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, చిన్నారుల తల్లిదండ్రులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.