calender_icon.png 11 May, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

11-05-2025 12:30:35 AM

-యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అరవింద్ కుమార్ యాదవ్

ముషీరాబాద్, మే10 (విజయక్రాంతి): భోలక్ పూర్ డివిజన్ సిద్దిక్ నగర్, బంగ్లాదేశ్ మార్కెట్ వీధిలో డ్రైనేజీ పైడ్లైన్ అనంతరం రోడ్డు పనులు చేపట్టాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అరవింద్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.

శనివారం భోలక్‌పూర్ డివిజన్లోని సిద్ధిక్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి అరవింద్ కుమార్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. అనంతరం అరవింద్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ... జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు సమన్వ యంతో పనిచేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ప్రజా ధనం వృద్ధా కాకుండా నిర్మాణ పనులు చేపట్టాలని కోరా రు. బంగ్లాదేశ్ మార్కెట్ వీధి, సిద్ధిక్ నగర్, సందాని వీధిలో డ్రైనేజీ పైప్లైన్లు అస్థవ్యస్థంగా మారడంతో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ రూ. 10.50లక్షలు డ్రైనేజీ పైపైన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని తెలిపారు. జీహెచ్‌ఎం సీ అధికారులు ఇప్పటికే రోడ్డు నిర్మాణానికి వీధులన్నీ తవ్వి పను లు ప్రారంభించారని తెలిపారు.

ప్రజా ధనం వృథా కాకుండా మంజూరైన నిధులతో డ్రైనేజీ పైప్లాన్లు పూర్తిచేసిన అనంతరం రోడ్డు పనులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సయ్యద్ మసూద్, భోలక్ ప్పూర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు జఫీర్ ఉద్దీన్, పార్టీ నాయకులు ఉస్మాన్, ఖైరత్ అలీబాబా, సోఫీ ముజీబ్, షారూక్ ఖాన్, ఉస్మాన్ పాల్గొన్నారు.