calender_icon.png 13 December, 2025 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ జిల్లాలో చెయ్యిదే పైచేయి

12-12-2025 01:16:25 AM

  1. 136 స్థానాలతో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు

ఉనికి చాటుకున్న బీఆర్‌ఎస్, బీజేపీ 

నిర్మల్, డిసెంబర్ 1౧ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో గురువారం జరిగిన మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దదారులు అధిక సంఖ్యలో గెలుపొందారు . ఖానాపూర్ నియోజకవర్గం లోని కడెం దస్తురాబాద్ పెంబి ఖానాపూర్ మండలాలతో పాటు నిర్మల్ నియోజకవర్గంలోని లక్ష్మణ చందా మామడ మండలాల్లో మొత్తం 136 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా అధికారులు ఫలితాలను ప్రకటించారు.

అధికార కాంగ్రెస్ పార్టీకి 69 స్థానాలు దక్కగా బిజెపికి 22  బి ఆర్ ఎస్ 19 స్వతంత్ర అభ్యర్థులుగా మరో 26 మంది విజయం సాధించారు. నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షుడిగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఖానాపూర్ లో ఖానాపూర్ మండలం లో కాంగ్రెస్ బిఆర్‌ఎస్ మధ్య నువ్వా నేనా అనే స్థితిలో ఎన్నికలు జరిగాయి కాంగ్రెస్ ఏడు స్థానాలు దక్కించుకోగా టిఆర్‌ఎస్ ఆరు స్థానాలు సాధించారు అయితే ఇక్కడ పది ఇండిపెండెంట్ లు విజయం సాధించగా బిజెపి రెండు స్థానాలకు పరిమితమైంది, కడెంలో కాంగ్రెస్ 15 బి ఆర్ ఎస్ 7 స్థానాలు దక్కించుకోగా బీజేపీకి ఒకే స్థానం దక్కింది.

స్వతంత్రులు ఆరుగురు గెలిచారు . పెంబి మండలంలో 24 స్థానాల గాను కాంగ్రెస్ 15 బిజెపి ఒకటి టిఆర్‌ఎస్ ఏడు స్థానాలు ఇండిపెండెంట్లు ఐదు చోట్ల విజయం సాధించారు దస్తురాబాద్ మండలంలో 13 స్థానాలకు గాను కాంగ్రెస్ ఎనిమిది బిజెపి 2 టిఆర్‌ఎస్ రెండు స్వతంత్రులు ఒక స్థానంలో విజయం సాధించారు, మామిడా మండలంలో 27 సన్నగాను 17 కాంగ్రెస్ ఎనిమిది బిజెపి ఒకరు టిఆర్‌ఎస్ ఒకరు స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించారు,

లక్ష్మణ చందా మండలంలో 18 స్థానాలకు గాను కాంగ్రెస్ ఏడు బిజెపి ఎనిమిది స్వతంత్రులు మూడు చోట్ల విజయం సాధించగా టిఆర్‌ఎస్ బోని చేయలేదు. బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి ప్రాథమిక వహిస్తున్న మామడ లక్ష్మి మండలాలు బిజెపికి 16 స్థానాలు దక్కించుకున్నారు

ప్రభుత్వ అభివృద్ధిని ప్రజలు గుర్తించారు

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం రెండేళ్లలో ప్రజల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడం వల్లనే జిపి ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దదారులు గెలుపు కారణమయ్యాయి.ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసిన ప్రజలు కాం గ్రెస్ వైపు ఉన్నారని ఎన్నికల ద్వారా మరోసారి రుజువైంది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ధరలను గెలుపొందిన ప్రజలకు అండగా ఉండి సేవ చేస్తాం.

డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం తో వ్యతిరేకత ఉందని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బిజెపి ప్రజలతో కలిసి పోరాటం చేస్తుందన్నారు.

 బీజేపీ నేత మహేశ్వర్‌రెడ్డి