02-12-2025 02:22:03 AM
ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
కొల్చారం, డిసెంబర్ 1:మండల కేంద్రమైన కొల్చారంలోని బాబా ఫంక్షన్ హాల్ లో సోమవారం మండల శాఖ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎన్నికలలో పార్టీ మద్దతుతో పోటీ చేయబోయే నాయకులు, వారిని బలపరచడానికి వచ్చిన కార్యకర్తలు చేసిన జై తెలంగాణ నినాదంతో ఫంక్షన్ హాల్ ప్రాంగణమంతా హోరెత్తింది.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ లోపాలను ఎత్తిచూపుతూ బీఆర్‌ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సమిష్టి కృషితో పార్టీ మద్దతు దారులను గెలిపించుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ లోపాలను ఎత్తిచూపారు. పోటీదారులు అంతర్గత కలహాలు లేకుండా ఐక్యమత్యంతో ముందుకు సాగాలన్నారు.
స్థానిక ఎన్నికలే రేపటి రాష్ట్ర ప్రభుత్వ గెలుపుకు నాంది అని, ఈ ఎన్నికలలో గెలుపు సాధించి రాబోయే శాసనసభ ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గౌరీశంకర్, సంతోష్ రావు. రవితేజ రెడ్డి , సొసైటీ చైర్మన్ చిన్నారపు ప్రభాకర్, మాజీ జెడ్పిటిసి మేఘమాల, ఎంపీపీ మంజుల కాశీనాథ్, ఆంజనేయులు పాల్గొన్నారు.