29-01-2026 12:01:18 AM
మిర్యాలగూడ, జనవరి 28 : మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం బుధవారం నోటిఫికేషన్ గా జారీ తో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగానే పట్టణంలోని 48 మున్సిపల్ వార్డులలో బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో భాగంగా స్థానిక అంబేద్కర్ భవన్, మహాత్మ జ్యోతిబాపూలే భవన్ లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలలో అంబేద్కర్ భవన్ ను మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణన్ అమిత్ మాలెం పాటి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన అక్కడ స్వీకరించే 24వార్డుల నామినేషన్ స్పీకర్లకు సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యంగా కూడా ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. నామినేషన్ కేంద్రంలో ఏర్పా టు చేసిన హెల్ప్ డేస్క్, అవసరమైన టేబుల్స్ తదితరం లను పరిశీలించి ప్రక్రియ సజావుగా జరిగేలా ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసిల్దార్ పి. శ్రీనివాస్, డి ఈ వెంకన్న,పట్టణ సిఐలు జెట్టి సోమ నరసయ్య నాగభూషణరావు, మాస్టర్ శిక్షకులు గుడిపాటి కోటయ్య యాదవ్, బాలు పాల్గొన్నారు.
నామినేషన్ల కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో, డీఎస్పీ
కోదాడ, జనవరి 28: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మొదటి రోజు కావడంతో కోదాడ పురపాలక కార్యాలయంలోని కేంద్రాలను ఆర్డీవో సూర్యనారాయణ రావు, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి బుధవారం సందర్శించారు. నామినేషన్ల స్వీకరణ తీరు, బందోబస్తు ఏర్పాట్లను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అభ్యర్థులు, అనుచరుల తాకిడి పెరిగే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. కాగా బుధవారం 25వ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. వారి వెంట సీఐ శివశంకర్, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, తహసీల్దార్ వాజిద్ తదితరులు ఉన్నారు.