calender_icon.png 29 January, 2026 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదు

29-01-2026 12:00:00 AM

  1. హనుమకొండ చౌరస్తాలో బహిరంగ చర్చకు సిద్ధమా కేటీఆర్ 
  2. బీఆర్‌ఎస్, బిజెపి పార్టీలు డిపాజిట్లకోసం ఆరాటం 
  3. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 

హనుమకొండ టౌన్, జనవరి 28 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ ఎ మ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి చేయకపోవడమే కాకుండా, అడ్డుకుం టున్నారని, బిఆర్‌ఎస్ నేతలపై ఆరోపణలు చేశారు. కల్పతా సూపర్ బజార్ సహా పలు విభాగాల్లో భారీ అవినీతి జరిగిందని, పెట్రో లు బిల్లులను డ్రైవర్ పేరిట, సభ్యత్యాల పేరి ట కలిపి సుమారు 50 లక్షల నిధులు దుర్వినియోగం జరిగాయని అన్నారు.

మా డవీధుల అభివృద్ధి పేరుతో గతంలో గుడిసె వాసులను ఇబ్బంది పెట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు. కులాలు, మతాలు పేరిట ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుతారని, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజల తరఫున దమ్ముంటే హనుమకొండ చౌరస్తాలో బహిరంగ చర్చకు రావాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సవాల్ విసిరారు. 

మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అభివృద్ధి నిరోధ కుడిగా వ్యవహరిస్తున్నారని, ఎన్జీవోస్ కాలనీలోని ఫంక్షన్ హాల్ కు ఒక్కో ఫంక్షన్కు హిస్టారీతిగా డబ్బులు వసూలు చేశారని, ఓడించాలని నీ కుటుంబ సభ్యులే సొంతంగా డబ్బులు ఖర్చుపెట్టి తిరిగిన విషయం ప్రజలు ఇంకా మర్చిపోలేదని, అసెంబ్లీలో ప్రజల సమస్యలపై మాట్లాడకుండా, భద్రకాళి ఆలయ టెండర్ ఇంకా పూర్తి కాలేదని, అయినా అవినీతి జరిగిందంటూ కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, ఎన్నిక లు దగ్గర పడుతున్న వేళ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రభుత్వ భూమి ని అక్రమంగా కబ్జా చేస్తే అధికారులు వెళ్లి కూల్చుతుంటే దళితుడికి అన్యాయం జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిప డ్డారు.

26 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని బిజెపి, బీఆర్‌ఎస్ పార్టీలు డిపాజిట్లు కాపాడుకోడానికే పరిమితం అవుతా యని, అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని, ఈ సంఘ వ్యతిరేక చర్యల కంటే కూడా ప్రమాదమని హెచ్చరించారు. శాశ్వత ఎమ్మెల్యే గా ఉండాలని తాపత్రం తనకు లేద ని, ప్రజలకు జవాబుదారీగా పని చేయడమే తన లక్ష్యమని, కాంగ్రెస్ పార్టీకి ఉన్న చరిత్ర, ప్రజల పట్ల బాధ్యతను ఇతర పార్టీలతో పో ల్చలేమని చెప్పారు. ప్రజా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని, అయినను వెనుకడుగు వే యబమని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఇ.వి శ్రీనివాసరావు, ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు జక్కుల రవీందర్, విజ యశ్రీ రజాలి, మామిండ్ల రాజు, బ్లాక్ అధ్యక్షులు నాయిని లక్ష్మారెడ్డి, బంక సంపత్, అం బేద్కర్ రాజు, అనుబంధ సంఘాల చైర్మన్ లు పెరుమండ్ల రామకృష్ణ, రాజకుమార్, శ్రావణ్, మాజీ కార్పొరేటర్ ఏనుకొంటి నాగరాజు, డివిజన్ అధ్యక్షులు ఏనుకొంటి పు న్నం చందర్, కాంగ్రెస్ శ్రేణులు తోట పవన్, మెరుగు శివ, వీసం సురేందర్ రెడ్డి, మండల సమ్మయ్య, తాళ్లపల్లి రవీందర్ (జెకె), బుస్సా నవీన్ కుమార్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.