19-05-2025 12:00:00 AM
కల్హేర్, మే 18: నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని కల్హేర్ మండల కేంద్రంలో ఆదివారం జొన్నల కొనుగోలు కేంద్రాన్ని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన రైతులతో మాట్లాడుతూ రైతు పండించిన పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని భరోసానిచ్చారు.
జొన్నల తూకంలో ఏలాంటి అవకతవకలు లేకుండా కేంద్రంలో రైతులకు అన్ని వసతులు కల్పించి రైతుల పక్షాన న్యాయంగా నిలబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ నరసింహారెడ్డి, వీర్ శెట్టి, జిత్తురెడ్డి, మల్దొడ్డి తుకారాం, దేవిదాస్, జ్ఞానేశ్వర్ పాటిల్, రైతులు, వ్యవసాయ అధికారులు, పాల్గొన్నారు.