21-11-2025 12:32:28 AM
హాజరైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
నారాయణఖేడ్, నవంబర్ 20: గత మూడు రోజులుగా నారాయణఖేడ్ పట్టణంలోని ఈ తక్షల ప్రాంగణంలో జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం గురువారం నాడు ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, డిఎస్పి వెంకటరెడ్డి హాజరై పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారాయణఖేడ్లో జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించడం ఎంతో గర్వకారణమని అన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు హాజరై తమ ప్రదర్శనలు ఇవ్వడం చాలా ఆనందకరమని అన్నారు. నారాయణఖేడ్ ప్రాంతంలో ఈ వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహించేందుకు ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం జరిగిందన్నారు.
జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 13,742 వేల మంది విద్యార్థులు ఈ వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించారన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనలో 713 ప్రదర్శనలు రావడం జరిగిందని అన్నారు. రాష్ట్రస్థాయి ప్రదర్శనకు 116 రాగా 30 జిల్లా స్థాయిలో ఎంపిక అయ్యాయని అన్నారు, ఇందులో 12 ప్రదర్శనలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరిగిందన్నారు.
అనంతరం ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సైన్స్ పరికరాలు ,వివిధ ల్యా బ్ లను అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో వచ్చే నిధులను సైన్స్ ల్యాబ్ లకు కేటాయించే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమోంటోలు అందజేశారు.
కార్యక్రమంలో డీఈవో వెంకటేశం, తెలంగాణ రాష్ట్ర లెక్చరర్స్ ఫోరం అధ్యక్షులు కళింగ కృష్ణ కుమార్, నారాయణఖేడ్ సీఐ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సైన్స్ ఫెయిర్ ఇంచార్జి సిద్ధారెడ్డి, భాస్కర్, ఆచార చంద్రశేఖర్, బాణాపురం రమేష్, రవీందర్ రావు, శివరాం, పాండురంగారెడ్డి, నాగనాథ్ , మధుసూదన్ రెడ్డి, జిల్లాలోని ఆయా మండలాల ఎంఈఓ లు, ఈ తక్షిల కరస్పాండెంట్ శరత్ పాల్గొన్నారు.