30-09-2025 12:00:00 AM
నిజామాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల న్యాల్కల్ ప్రాథమిక పాఠశాలలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో మూల నక్షత్ర సందర్భంగా సరస్వతి దేవి మాత విగ్రహ స్థాపన చేశారు. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మండల విద్యా అధికారి గేమ్సింగ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు భక్తి భావన పెంపొందించుకోవాలన్నారు పాఠశాలలో సరస్వతి మాత విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఎల్ కిరణ్ కుమార్. భోజనం ప్రధానోపాధ్యాయులు కొత్తూరు దేవదాస్ గ్రామ సచివాలయ కార్యదర్శి మల్లేశం విగ్రహ దాత గంగమని దంపతులు వీడిసి చైర్మన్ కిరణ్ గ్రామ పెద్దలు శ్రీధర్ ఏ ఏపిసి చైర్మన్ సునీత దంపతులు ఉపాధ్యాయులు పోసాని శారద మాధవి గ్రామ పొదుపు సంఘాల ప్రతినిధులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు