20-05-2025 12:10:11 AM
బాన్స్వాడ మే 19 (విజయ క్రాంతి): బాన్సువాడ మండలం ఇబ్రాహీంపేట్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వీరాంజనేయ స్వామి మందిరం విగ్రహ పున ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అనంతరం బాన్సువాడ పట్టణం కల్కి చెరువు కట్ట శ్రీ హనుమాన్ సాయి ఆలయం యొక్క 15 వ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరై స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ మరియు పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పోచారంమండల ప్రజాప్రతినిధులు నాయకులు భక్తులు పాల్గొన్నారు
వివాహ కార్యక్రమంలో పాల్గొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ నియోజకవర్గం లోని పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పోచారం సురేందర్ రెడ్డి బాన్సువాడ మండలం సంగోజిపేట్ వాస్తవ్యులు గొబ్బిల రాజమని - సాయిలు కుమారుడు వెంకటేష్ - భవిత వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
బాన్సువాడ మండలం పోచారం వాస్తవ్యులు ఆకుల శారద - సాయిలు కుమారుడు సునీల్ కుమార్ - అపర్ణ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. బాన్సువాడ మండలం ఎస్ ఎమ్ బి ఫంక్షన్ హాల్ లో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జూబేర్ కూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
బాన్సువాడ పట్టణం లో సరస్వతి ఫంక్షన్ హాల్ లో బాన్సువాడ సబ్ కలెక్టర్ సి సి అంజు కుమార్తే సంజన కుమారుడు విశ్వంత్ ల నూతన వస్త్రాధారణ కార్యక్రమానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.