calender_icon.png 20 May, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వన మహోత్సవంలో మొక్కలు నాటేందుకు ప్రణాళిక

20-05-2025 12:08:24 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

మెదక్, మే 19(విజయ క్రాంతి): మెదక్ జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు అధికారులు  కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని  మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులు ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో డీఎఫ్‌ఓ జోజి ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమ శాఖల వారీగా మొక్కలు నాటే కార్యక్రమం  నిర్దేశించిన లక్ష్యాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ .. మెదక్ జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల వారీగా 37 లక్షల మొక్కలు నాటేందుకు ప్రభుత్వ లక్ష్యాలను సూచించడం జరిగిందని  పటిష్ట కార్యచరణ తయారు చేసుకుని సిద్ధంగా ఉండాలన్నారు . వర్షాలు మొదలైన నాటి నుండే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, అటవీ శాఖ సమన్వయంతో వ్యవహరించాలన్నారు.

ఏరియాల వారీగా నర్సరీలో మొక్కలు పెంచి నాటేందుకు సిద్ధంగా ఉన్నాయని  సంబంధిత శాఖలకు మొక్కలు అందజేయాలని డిఆర్డిఓ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్ భుజంగరావు, డిఆర్డిఓ పిడి శ్రీనివాసరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ముఖ్య ప్రణాళిక అధికారి, సంబంధిత ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.