04-08-2025 12:00:00 AM
రాష్ట్ర ఆటో డ్రైవర్స్ జేఏసీ కన్వీనర్ అమానుల్లా ఖాన్
ముషీరాబాద్,ఆగస్టు 3(విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్డు ప్రమాదాలు, హత్య లు, నేరాలు, ఘోరాలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, వీటిని అరిక ట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ ఆటో డ్రైవర్ జేఏసీ కన్వీనర్ మహమ్మద్ అమానుల్లా ఖాన్ ఆరోపించా రు.
ఈ మేరకు ఆదివారం హైదర్ గూడలోని ఎన్‌ఎస్‌ఎస్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలువురు జేఏసీ నాయకులతో కలిసి రాష్ట్రంలో ఫ్రీ బస్సు బదులు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 14న నగరంలో ఒకరోజు ఆటో బంద్ కు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆయన పలువురు జేఏసీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడు తూ రాష్ట్రంలో ఫ్రీ బస్సు బదులు సంపూర్ణ మధ్య నిషేధం విధిస్తారా.. లేక ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ సర్వీస్ చార్జీలు పుండు మీద కారం చల్లినట్లుగా ఉందని, వెంటనే జీవో నెంబర్ 51 ఉపసంహరించుకోవాలని డి మాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం ప్రకారం ప్రతి డ్రైవర్ కు రూ. 12 వేలు వెంటనే చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు యాహియా, షేక్ అమీర్, మహమ్మద్ లతీఫ్, షరీఫ్ బాయ్, ముజాహిద్ హాష్మీ, మహమ్మద్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.