calender_icon.png 5 October, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లిని కడతేర్చిన కొడుకు

05-10-2025 12:19:04 AM

-మద్యం డబ్బుల కోసం హత్య

-రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో ఘటన

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 4: మద్యం డబ్బులు ఇవ్వలేనది కన్న తల్లిని ఓ కసాయి కొడుకు కడతేర్చాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామం లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఆరుట్ల గ్రామానికి చెందిన మానిపాటి ఐలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. వీరి ముగ్గురికి పెళ్లి లు అయ్యాయి. తల్లి ఐలమ్మ గంపలు అల్లికలు పనులు చేస్తూ జీవ నం సాగిస్తున్నది. ఆమె పెద్ద కుమారుడు శ్రీకాంత్(34)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా మద్యానికి బానిసైన శ్రీకాంత్ డబ్బు కోసం తల్లితో తరచూ గొడవపడేవాడు. శుక్రవారం రాత్రి కూడా మద్యానికి డబ్బులు ఇవ్వకపోవడంతో కిరాతకుడిగా మారి ఇనుప రాడ్డుతో తల్లిపై దాడి చేశాడు. దీంతో రక్తపు మడుగు లో పడిఉన్న ఐలమ్మను గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది.