23-12-2025 02:13:02 AM
విజేతలైన కరాటే విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం
ఘట్‌కేసర్, డిసెంబర్ 22 (విజయక్రాంతి) : జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మేడ్చల్‌మల్కాజిగిరి జిల్లా ఆధ్వర్యంలో సోమవారం జిహెచ్‌ఎంసి పోచారం సర్కిల్ పరిధిలోని అన్నోజిగూడ ఎమరల్ హైట్స్లో తెలంగాణ ఇంటర్ స్కూల్స్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ టోర్నమెంట్ను తెలంగాణ బోర్డు ఆఫ్ డైరెక్టర్ గుగులోత్ గోవింద్ నాయక్ నిర్వహించిన ఈ పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ చీఫ్ జడ్జ్, చీఫ్ ఇన్స్ట్రక్టర్ అండ్ వైస్ చైర్మన్ షిహన్ రాపోలు సుదర్శన్ హాజరయ్యారు. వీరితో పాటు తెలంగాణ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు శ్రీనివాస్ చారి, రమేష్ గౌడ్, నర్సింహచారి, సీనియర్ మాస్టర్ నాగరాజు పాల్గొన్నారు.
మొదటగా జ్యోతి ప్రజ్వ లన కార్యక్రమం నిర్వహించి, అనంతరం కరాటే విద్యార్థుల చేత కటా, కుమితే డెమోను ప్రదర్శించారు. తదుపరి షిహన్ రాపోలు సుదర్శన్ చేతుల మీదుగా కరాటే పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ పోటీలు అండర్8, 10, 12, 14, 16, 18 సంవత్సరాల వయస్సు కేటగిరీలలో నిర్వహించబడ్డాయి. ఈ టోర్నమెంట్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన 25 వివిధ పాఠశాలల నుంచి సుమారు 400 మంది విద్యార్థులు కటా, కుమితే విభాగాలలో పాల్గొన్నారు. విజేతలైన కరాటే విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం చేయడం జరిగింది. బాలుర బ్లాక్ బెల్ట్ విభాగంలో కటా, కుమితే ఛాంపియన్గా గుగులోత్ నరసింహ గెలుపొందగా, బాలికల బ్లాక్ బెల్ట్ కటా అండ్ కుమితే విభాగంలో నక్క సుజనా ప్రియా ఛాంపియన్గా నిలిచారు.
ఈ సందర్భంగా షిహన్ రాపోలు సుదర్శన్ మాస్టర్ విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ టోర్నమెంట్లో రోటెర్డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కరాటే విద్యార్థులు మొత్తం 60 మెడల్స్ సాధించారు. వీటిలో 20 గోల్డ్, 20 సిల్వర్, 20 బ్రాంజ్ మెడల్స్ ఉండటంతో ఆ పాఠశాల టోర్నమెంట్ ఛాంపియన్గా నిలిచింది. ఈకరాటే పోటీల నిర్వహణలో ఆర్గనైజర్, తెలంగాణ బోర్డు ఆఫ్ డైరెక్టర్ గుగులోత్ గోవింద్ నాయక్ జిల్లా బోర్డు ఆఫ్ మెంబర్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్. సంతోష్ కుమార్, పి. శ్రీనివాస్ ఎన్. నాగరాజు, ఆర్. కోమల్, యం. సాయి కిరణ్, యస్. కిరణ్, జి. అక్షయ్ కుమార్, పి. అవినాష్ యాదవ్, హెచ్. అజిత్ లు పాల్గొన్నారు. అనంతరం విజేతలైన కరాటే పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేశారు.